Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమన్నాడు.. నాలుగు నెలలు కాపురం చేశాడు.. పెళ్లి మాటెత్తగానే ముఖం చాటేశాడు!

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. అయితే కులం పేరిట మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్‌జిల్లా బోడ్‌మట్‌పల్లి గ్రామానికి చెందిన నరేష్ జోగిపేటలో డిగ్రీ చదువుతున్నాడు. అదే జిల్లాకు చెందిన

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (09:10 IST)
పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. అయితే కులం పేరిట మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్‌జిల్లా బోడ్‌మట్‌పల్లి గ్రామానికి చెందిన నరేష్ జోగిపేటలో డిగ్రీ చదువుతున్నాడు. అదే జిల్లాకు చెందిన యువతితో స్నేహం చేశాడు. ఈ స్నేహం ప్రేమ వరకు వచ్చింది.

అయితే పెళ్లికి మాత్రం నరేష్ ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని నగరానికి తీసుకొచ్చిన నరేష్.. భార్యాభర్తలమని చెప్పి ఓ కాలనీలో గది అద్దెకు తీసుకొని నాలుగు నెలల పాటు కాపురం చేశాడు. 
 
ఖర్చుల కోసం సర్దార్‌ పటేల్‌నగర్‌లోని ఓ కంపెనీలోనూ పనిచేస్తున్నాడు. అయితే ఇక పెళ్లి చేసుకోవచ్చుగా అని ఆ యువతి అడిగితే ముఖం చాటేశాడు. ఇరువురి కులాలు వేర్వేరని, మా తల్లిదండ్రులు అంగీకరించడంలేదని యువతితో చెప్పాడు.

పెళ్లి చేసుకోకుండానే ఉండిపోదామని చెప్పడంతో ఆ యువతి తాను మోసం పోయానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు నరేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments