Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబ‌న్ల‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానిస్తున్న రష్యా.. అక్టోబర్ 20న ముహూర్తం

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (20:36 IST)
ఇటీవ‌ల అమెరికా బ‌ల‌గాలు వెన‌క్కి వెళ్లిపోవ‌డంతో.. ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ దేశాల‌తో స‌త్ సంబంధాల‌ను కోరుకుంటున్న‌ట్లు కూడా తాలిబ‌న్లు వెల్ల‌డించారు. ఈ మ‌ధ్యే జ‌రిగిన ఐక్యరాజ్య‌స‌మితి స‌మావేశాల స‌మ‌యంలోనూ.. తమ త‌ర‌పు ప్ర‌తినిధి మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని తాలిబ‌న్లు కోరారు. 
 
వివిధ దేశాల‌తో స‌ఖ్య‌త నెల‌కొల్ప‌న్న ఉద్దేశంతో తాలిబ‌న్ల‌ను చ‌ర్చ‌ల‌కు ర‌ష్యా ఆహ్వానిస్తోంది. అక్టోబ‌ర్ 20వ తేదీన అంత‌ర్జాతీయ చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు తాలిబ‌న్ల‌ను ర‌ష్యా ఆహ్వానించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 
 
తాలిబ‌న్ ప్ర‌తినిధుల‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించిన‌ట్లు ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త‌ర‌పు రాయ‌బారి వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఆహ్వానాన్ని పంపిన‌ట్లు జ‌మిర్ కుబులోవ్ తెలిపారు. అయితే మీటింగ్ ఎప్పుడు జ‌రుగుతుంది. ఎవ‌రు హాజ‌ర‌వుతార‌న్న అంశాల‌పై క్లారిటీ రాలేదు. నిజానికి తాలిబ‌న్ల‌ను నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌గా చూస్తారు. ర‌ష్యాలోనూ ఆ సంస్థ‌పై బ్యాన్ ఉందన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments