Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ యువరాజు తండ్రి అయ్యారు.. మేఘన్‌.. హ్యారీకి పండంటి బాబు పుట్టాడోచ్..

Webdunia
మంగళవారం, 7 మే 2019 (17:00 IST)
బ్రిటన్ యువరాజు తండ్రి అయ్యారు. బ్రిటన్ యువరాజు హ్యారీ, హాలీవుడ్ నటీమణి మేఘన్ మార్కెల్‌లకు గత ఏడాది మే నెల 19వ తేదీన అట్టహాసంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్‌లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగింది. 
 
ఈ నేపథ్యంలో హ్యారీ సతీమణి పండంటి బాబుకు జన్మనిచ్చిందని రాచ కుటుంబం అధికారికంగా ప్రకటించింది. దీంతో బ్రిటన్ ప్యాలెస్ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 5:26 గంటలకు మార్కెల్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు హ్యారీ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. 
 
తన బిడ్డకు సంబంధించిన మరిన్ని విషయాలను రాబోయే రోజుల్లో షేర్ చేసుకుంటానని హ్యారీ పేర్కొన్నారు. ఇక హ్యారీ కుమారుడు బ్రిటన్ రాజ వంశంలో పుట్టిన ఏడో మగ వారసుడు. అంతేగాకుండా రెండవ రాణి ఎలిజెబెత్‌కు ఎనిమిదవ ముని మనవడు అవుతాడని రాజకుటుంబం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments