Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్.. అమెరికా సంచలన రిపోర్ట్

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (22:56 IST)
కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? మొదటిసారి ఎలా వ్యాపించింది? అనే విషయాలపై ప్రపంచ శాస్త్రవేత్తలు, అధికారులు ఎన్నోరోజులుగా సమాధానం వెతుకుతున్నారు. సరైన సమాధానం మాత్రం ఇప్పటివరకు దొరకలేదు. చైనా వైరస్‌ అని అమెరికా అనడం అప్పట్లో సంచలనం కూడా అయ్యింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనాపై ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ చైనా తాము తయారు చేయలేదంటూ వాదించింది. తాజాగా కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టుకొచ్చిందని ఆధారాలు కనిపిస్తున్నాయి.
 
చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయ్యిందని, చైనా శాస్త్రవేత్తలు మానవులకు సోకేలా వైరస్‌పై పనిచేసినట్లుగా అమెరికా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. COVID-19 వ్యాధికి కారణమైన కరోనా వైరస్ చైనా పరిశోధన కేంద్రం నుంచే లీక్ అయినట్లుగా గూఢచార సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(WIV) శాస్త్రవేత్తలు, నిపుణులు చైనీస్ ప్రభుత్వ నిధుల సహాయంతో మానవులకు సోకేలా కరోనావైరస్‌ను సవరించారని, ఈ మేరకు వారు పని చేసినట్లుగా తగిన సాక్ష్యాలను గుర్తించినట్లు రిపోర్ట్ పేర్కొంది.
 
హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో అగ్రశ్రేణి రిపబ్లికన్ ప్రతినిధి మైక్ మెక్‌కాల్ ప్యానెల్ ఈ మేరకు నివేదికను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా 4.4 మిలియన్ల మంది మరణించిన COVID-19 కరోనావైరస్ మహమ్మారి మూలాలపై ఈ సంచలన రిపోర్ట్ విడుదల చేశారు. 
 
అయితే, చైనా మాత్రం వైరస్ తయారు చేసింది కాదని, పుట్టిందేనని చెబుతున్నారు. బీజింగ్ కూడా ఈమేరకు ప్రకటనలు చేస్తుంది. వుహాన్‌లో ల్యాబ్ నుంచి కరోనావైరస్ లీక్ అయ్యింది అంటూ వచ్చిన వార్తలను చైనా ఖండించింది. 2019లో మొదటి COVID-19 కరోనా కేసు కనుగొన్నారు. అప్పటినుంచి ప్రతీ దేశాన్ని కరోనా చుట్టుముట్టింది. భయం గుప్పెట్లో ప్రజలు గడిపేలా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments