Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు!

ఠాగూర్
మంగళవారం, 1 అక్టోబరు 2024 (08:57 IST)
భారతీయులకు రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు మంజూరు చేసింది. 2023లో 1.4 లక్షల మందికి వీసాలు మంజూరు చేయగా, తాజాగా ఈ సంఖ్యను రెట్టింపు చేసింది. ఇతర దేశాల విద్యార్థులతో పోల్చుకుంటే భారతీయ విద్యార్థులకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు అగ్రరాజ్యం అమెరికా తన చర్యల ద్వారా చెప్పకనే చెప్పింది. 
 
భారతీయ విద్యార్థులకు వరుసగా నాలుగో యేడాది కూడా అమెరికా రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు మంజూరు చేసిందని భారతీయ దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎన్ని వీసాలు జారీ చేసిందన్నదానిపై ఖచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ 2023లో మాత్రం 1.4 లక్షలకుపైగా వీసాలు జారీచేసివుంటుందని భావిస్తున్నారు. 
 
దీనిపై భారత్‌లో అమెరికా దౌత్యకార్యాలయ వర్గాలు స్పందిస్తూ, ఈ వేసవి కాలంలో రికార్డు స్థాయిలో వీసా దరఖాస్తులను పరిశీలించామని, దరఖాస్తుదారులందరూ తొలిసారిగా అమెరికా వెళుతున్నావారేనని పేర్కొన్నాయి.
 
కాగా, భారతీయ విద్యార్థుల నుంచి అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో అమెరికా కొత్తగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ అపాయింట్మెంట్ స్లాట్లను విడుదల చేయడం వల్ల భారతీయ విద్యార్థులు తగిన వ్యవధిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని అమెరికా ఎంబసీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments