Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రాన్స్ అధ్యక్షుడుగా మళ్లీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (08:41 IST)
ఫ్రాన్స్ దేశాధ్యక్షుడుగా మళ్లీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోమారు ఎన్నికయ్యారు. అయితే, ఆయన గెలుపు పట్ల ఫ్రాన్స్ యువతి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఆయన గెలుపునకు నిరసనగా ఆదివారం రాత్రి యువత వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. దీంతో వారిపై పోలీసులు లాఠీని ప్రయోగించారు. బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. 
 
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు వ్యతిరేకంగా సెంట్రల్ పారిస్‌లోని చాట్‌లెట్ సమీపంలో గుమికూడిన యువకులను పోలీసులు చెదరగొట్టారు. యూనివర్శిటీల్లో విద్యార్థులు నిరసన తెలిపారు. కాగా, మాక్రాన్ మాత్రం మరోమారు ఫ్రాన్స్ అధ్యక్షుడు సంపూర్ణ మెజార్టీతో ఎన్నికయ్యారు. 
 
తన ప్రత్యర్థి మెరీన్ లీ పెన్‌పై 16 శాతం ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, వెన్‌కు మాత్రం 42 శాతం ఓట్లు వచ్చాయి. ఈ గెలుపుతో గత రెండు దశాబ్దాల కాలంలో వరుసగా రెండోసారి అధ్యక్షుడుగా ఎన్నికైన నేతగా మాక్రాన్ చరిత్రపుటలకెక్కాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments