Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారంలో పాల్గొని వ్యభిచారిణులకు డబ్బులిస్తే నేరం.. ఎక్కడ?

సాధారణంగా నిరాశ్రయులైన కొందరు మహిళలు డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంటారు. ఈ వ్యభిచారం పలు దేశాల్లో నేరం. మరికొన్ని దేశాల్లో వ్యభిచార వృత్తికి చట్టబద్ధత ఉంది.

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2017 (07:00 IST)
సాధారణంగా నిరాశ్రయులైన కొందరు మహిళలు డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంటారు. ఈ వ్యభిచారం పలు దేశాల్లో నేరం. మరికొన్ని దేశాల్లో వ్యభిచార వృత్తికి చట్టబద్ధత ఉంది. అయితే, ఫ్రాన్స్‌ మాత్రం వ్యభిచారం నేరం కాదు కానీ, వ్యభిచారిణులకు డబ్బులు ఇవ్వడం మాత్రం నేరం. శృంగారం కోసం డబ్బులు చెల్లించే కస్టమర్లపై ఆ దేశం భారీ జరిమానా విధిస్తుంది.
 
ఫ్రెంచ్ పార్ల‌మెంట్ కొత్తగా ఆమోదం పొందిన ఈ చట్టం ప్రకారం వ్యభిచారులకు డబ్బులు చెల్లించడం నేరం. కానీ వ్యభిచారం మాత్రం నేరం కాదు. ఈ నియమాళిని ఉల్లంఘించిన విటులకు స్థానిక పోలీసులు అవగాహనా తరగతులు తీసుకుంటారు. వ్యభిచార వృత్తి వల్ల కలుగుతున్న నష్టాలను కూడా ఆ కస్టమర్లకు తెలియజేస్తారు.
 
నిజానికి ప్రస్తుతం ఫ్రాన్స్‌లో వ్యభిచారానికి చట్టబద్ధత ఉంది. కానీ వ్యభిచార గృహాల ద్వారా, మైనర్ల సెక్స్‌ను ఫ్రాన్స్ చట్టవ్యతిరేకంగా భావిస్తుంది. కొత్త చట్టం ప్రకారం శృంగారాన్ని కొనే కస్టమర్‌కు 2500 డాలర్ల జరిమానా విధించనున్నారు. 
 
ఒకవేళ రెండోసారి దొరికితే ఆ కస్టమర్‌కు జరిమాను మరింత రెట్టింపు వసూలు చేస్తారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో సుమారు 30 వేల మంది వ్యభిచార వృత్తిలో ఉన్నారు. అందులో 80 శాతం మంది విదేశీయులే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం