Webdunia - Bharat's app for daily news and videos

Install App

#టాంజానియా చర్చిలో తొక్కిసలాట-20 మంది మృతి.. ఫాదర్ అరెస్ట్

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:16 IST)
టాంజానియాలోని ఓ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 20మంది ప్రాణాలు కోల్పోయారు. తాను దేవుడి దూతనని, రోగాలను నయం చేసే నూనె తన దగ్గర వుందని మోషి టౌన్ లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ చర్చిలో ప్రముఖ మత బోధకుడు బోనిఫేస్ వాంపోసా తెలిపారు. ఈ నూనెను అక్కడికి వచ్చిన భక్తులపై చల్లడంతో ప్రేయర్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
 
ఇలా భక్తులు ఆ నూనెను చల్లుతుంటే ఆ పవిత్రమైన నూనె తమపై పడాలని అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే మతబోధకుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. మోషిలో 20 మంది చనిపోయిన ఘటనపై టాంజానియా ప్రెసిడెంట్ మగుఫులి సంతాపం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యుడైన మతబోధకుడికి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు. 
 
ఇంకా పోలీసులు మాట్లాడుతూ.. ఫాస్టర్లు చాలామంది దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తామని, దారిద్ర్యాన్ని పారద్రోలు తామని ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా జనాలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఇలా ఆర్థిక కుంభకోణాలు, మనీ లాండరింగ్ పథకాలు జరుగుతున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments