Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్లగూడాలో దొంగల బీభత్సం... బంగారం-వెండి దోపిడి

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:06 IST)
రాజేంద్రనగర్ పోలిస్టేషన్ పరిధిలోని బండ్లగుడాలో దొంగల బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇల్లును గుల్ల చేశారు దుండగులు. పది తులాల బంగారం, 30 తులాల వెండి అపహరించారు. 
 
ఖమ్మం ప్రాంతానికి చెందిన భాజా, సాధన అనే సాఫ్ట్వేర్ ఉద్యోగులు బండ్లగుడాలోని భారతి నగర్‌లో అద్దెకు ఉంటుంన్నారు. నిన్న సాయంత్రం భాజా సొంత పనిమీద ఖమ్మం వెళ్ళేందుకు భార్య సాధనాను పక్కనే ఉంటున్న అత్తవారింట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్ళాడు. 
 
ఉదయం ఇంటి యజమాని ఇంటి వైపు చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో సాధనకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సాధన ఇంట్లోకి వెళ్ళి చూసే సరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి.
 
బీరువాలోని పది తులాల బంగారం, 30 తులాల వెండి కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పొలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌లను రంగంలోకి దింపి అధారాలను సేకరిస్తున్నారు.
 
కాలనీలో ఒక ఇంటిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రాత్రి టైంలో రికార్డ్ అయిన దృశ్యాల్లో కవర్ పట్టుకొని వెళ్తున్న వ్యక్తిని చూసి సాధన ఆ కవర్ వాళ్ల ఇంట్లోనిది అని గుర్తుంచింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments