Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినందన్ అప్పగింతకు పాకిస్థాన్ సమ్మతం

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (16:47 IST)
కోట్లాది మంది భారత ప్రజల ప్రార్థనలు ఫలించాయి. శత్రుసైన్యం చేతిలో బందీగా ఉన్న భారత వైమానిక దళం విగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్ సమ్మతం తెలిపింది. అభినందన్‌ను శుక్రవారం భారత్‌కు అప్పగిస్తామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తాము యుద్ధం కంటే శాంతిని కోరుకుంటున్నామన్నారు. ఈ నిర్ణయం పాకిస్థాన్ విశాల హృదయాన్ని తెలియజేస్తుందన్నారు. 
 
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్ మొహ్మద్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడులను ఓర్చుకోలేని పాకిస్థాన్.. భారత్‌పై ప్రతీకారదాడులకు దిగింది. వీటిని భారత్ తిప్పికొట్టింది. 
 
అదేసమయంలో పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చిన భారత మిగ్ ఫైటర్ జెట్ కమాండర్ అభినందన్ వర్దమాన్ నడిపిన మిగ్ విమానం కూలిపోయింది. కానీ పారాచూట్ సాయంతో అభినందన్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఆయన పాకిస్థాన్ భూభాగంలో దిగాడు. దీంతో పాకిస్థాన్ సైనికులు ఆయన్ను బందీగా పట్టుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం ప్రకటించింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకి చేసింది. భారత్ చర్యలను అనేక దేశాలు సమర్థించాయి. పైగా, ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్న ధ్వంసం చేయాల్సిందేనంటూ అంతర్జాతీయ సమాజం నొక్కివక్కాణించింది. దీనికితోడు బందీగా ఉన్న భారత పైలట్ అభినందన్‌ను తక్షణం విడుదల చేయాలని పాక్‌పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా శుక్రవారం ఆయన్ను అప్పగించేందుకు శత్రుదేశం పాకిస్థాన్ సమ్మతించింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments