Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ రెస్టారెంట్‌లో నవాజ్ షరీప్... ముచ్చట్లు చెబుతున్నారా?

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (13:22 IST)
అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లండన్ రెస్టారెంట్లలో కనిపించారు. ఓ గదిలో పలువురుతో ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉండటంతో ఈ ఫోటో ఈ వైరల్ అయింది. దీంతో నవాజ్ షరీఫ్ అనారోగ్యంపై ఇప్పటివరకు జరిగిన ప్రచారం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
 
నిజానికి మనీలాండరింగ్ కేసులో షరీఫ్‌కు జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ముఖ్యంగా, రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతున్నాయని, మెరుగైన వైద్యం కోసం లండన్ వెళ్లాలని వైద్యులు సూచించారని ఆయన తరపు న్యాయవాది పిటిషన్ వేయడంతో లాహోర్ కోర్టు ఇటీవల ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఫలితంగా ఆయన లండన్‌కు వెళ్లిపోయారు. 
 
కోర్టు అనుమతితో గతేడాది నవంబరు నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. ఆయనకు ఇచ్చి నాలుగు వారాల బెయిల్ గడువు ముగియడంతో ఈ గడువును పొడిగించాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. మంచం దిగే పరిస్థితిలోనూ నవాజ్ షరీఫ్ లేడని అందరూ భావిస్తోన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చి వైరల్ అవుతోంది.
 
ఓ రెస్టారెంటులో నవాజ్ షరీఫ్ హాయిగా కూర్చొని కొందరికి ముచ్చట్లు చెబుతున్నట్లు అందులో ఉంది. దీంతో ఆయన నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయనకు బెయిల్ గడువు పొడిగించే అవకాశం లేదని ఊహాగానాలు వస్తున్నాయి.
 
లండన్‌లోని రెస్టారెంటులో షరీఫ్.. పీఎంఎల్ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, అతడి కుమారుడు హంజాలతో కలిసి కూర్చొని ఉన్నట్లు ఈ ఫొటోలో స్పష్టంగా కనపడుతోంది. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా స్పష్టమవుతోంది. ఈ ఫొటో పాక్‌లో తీవ్ర చర్చనీయాశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments