Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదివేల మందిలో ఫోటోలు దిగిన సూపర్ స్టార్ మహేష్‌బాబు...

Advertiesment
పదివేల మందిలో ఫోటోలు దిగిన సూపర్ స్టార్ మహేష్‌బాబు...
, శుక్రవారం, 27 డిశెంబరు 2019 (15:35 IST)
టాలీవుడ్ హీరోలలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు రూటే సపరేటు. తనదైన నటనతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ హీరోకు వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. టాలీవుడ్‌లో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న కొద్ది మంది హీరోలలో మహేష్‌బాబు ఒకరు. మహేష్‌బాబును అభిమానుల హీరో అని అంటుంటారు. 
 
అంతేకాకుండా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా తాను పెద్ద హీరోగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా నిరూపించుకున్నాడు. వేయి మందికి పైగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్‌లు చేయించి వారికి పునర్జన్మను ప్రసాదించాడు.
 
సేవా కార్యక్రమాలను చేపట్టడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటాడు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో రెండు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. గతంలో కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల కోరిక మేరకు వారిని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమా ఫంక్షన్‌లలో, అలాగే తనను కలవడానికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగుతాడు.
 
తన బౌన్సర్లు అభిమానులపై చేయి చేసుకున్నప్పుడు వారితో అనేక సందర్భాల్లో వారించారు. ఇటీవల మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సందర్భంగా తన వద్దకు వచ్చిన అభిమానులతో మహేష్ ఫోటోలు దిగాడు. గతంలో ఎన్నడూలేని విధంగా పది వేల మంది అభిమానులతో మహేష్ ఫోటోలు దిగాడు. 
 
గంటల సమయం గడుస్తున్నప్పటికీ ఓపికగా ఉంటూ తన కోసం వచ్చిన అభిమానులను నిరాశపరచకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వచ్చిన తన అభిమానుల కోసం మహేష్ భోజన ఏర్పాట్లు కూడా చేసాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనసూయ, రష్మికి పోటీగా వచ్చిన కొత్త యాంకరమ్మ...