Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరో విషాదం : కూలిన ప్రైవేట్ జెట్... ఆరుగురు దుర్మరణం

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (09:31 IST)
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలో వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై 64 మంది ప్రయాణికులతో కూడిన విమానం.. ల్యాండ్ అవుతున్న  ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన నుంచి అమెరికా పౌరులు ఇంకా తేరుకోకముందే తాజాగా మరో విమాన ప్రమాదం సంభవించింది. 
 
ఫిలడెల్ఫియాలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. జనావాసాలు, షాపింగ్ మాల్స్‌పై కూలడం వల్ల మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. లియర్ జెట్ 55కు చెందిన మెడికల్ ట్రాన్స్‌పోర్టు విమానం... ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6.06 నిమిషాలకు నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. 1600 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత కొన్ని సెకన్లలోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫ్లైట్ మొత్తం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments