Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండికి వార్నింగ్ : గద్దర్ అన్న గల్లీ అని రాసుకునేటట్లు చేస్తా బిడ్డా.. సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (09:15 IST)
తెలగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలని సీఎం రేవంత్ కేంద్రానికి లేఖ రాయగా, కేంద్రం పట్టించుకోలేదు. దీనిపై సీఎం తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర మంత్రిగా ఉన్న తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మాత్రం గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్‌కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలని.. మేం ఇవ్వం అంటూ వ్యాఖ్యానించారు. పైగా, గద్దర్‌ను లక్ష్యంగా చేసుకుని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాజ విద్రోహ శక్తిగా అభివర్ణించారు. తుపాకీ చేతబట్ట అనేక మంది ప్రాణాలు తీశాడంటూ ఆరోపించారు. 
 
దీంతో సీఎం రేవంత్ రెడ్డికి కోపమొచ్చింది. ఇంకోసారి గద్దర్‌ను కించపరిచేలా మాట్లాడితే మీ పార్టీ ఆఫీసులు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతానంటూ హెచ్చరించారు. అపుడు మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దర్ అన్న గల్లీ అని రాసుకునేటట్లు చేస్తా బిడ్డా, ప్రతి దానికి మా దగ్గర మందు ఉంది సామి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న రోడ్డుకు గద్దరన్న గల్లీ అని పేరు పెడతా, ఇంకోసారి గద్దరన్న గురించి తప్పుగా మాట్లాడితే, మీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న రోడ్డుకు గద్దరన్న పేరు పెడతాం.. అప్పుడు మీ పార్టీ అడ్రెస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే కామెంట్స్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 




 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments