Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచానికి శుభవార్త... ఫైజర్ కరోనా వ్యాక్సిన్ సిద్ధం

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (06:40 IST)
అమెరికన్‌ ఫార్మా సంస్థ 'ఫైజర్‌' జర్మనీకి చెందిన ప్రముఖ బయోటెక్‌ సంస్థ ‘బయోఎన్‌టెక్‌’తో కలిసి ప్రపంచానికి శుభవార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయని ప్రకటించింది.

వ్యాక్సిన్‌ పనితీరుపై ఇండిపెండెంట్‌ డేటా మానిటరింగ్‌ కమిటీతో నవంబరు 8న మధ్యంతర విశ్లేషణ చేయించి.. ఫలితాలను వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి భారీస్థాయిలో జరుగుతున్న మూడో దశ ప్రయోగాల సమాచారాన్ని ఇలా బహిరంగంగా వెల్లడించింది ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలే.

మూడో దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలూ కనిపించలేదని, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరులోగా అమెరికాలో అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నామని ఆ సంస్థలు తెలిపాయి.

2020లోనే ప్రపంచ వ్యాప్తంగా 5కోట్ల వ్యాక్సిన్లు, 2021 నాటికి 130కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని ఫైజర్‌ సంస్థ తెలిపింది. దీని ఫేజ్‌-3 ట్రయల్స్‌ జూలైలో మొదలయ్యాయి. ఇప్పటిదాకా 38,955 మంది  రెండో డోసు కూడా వేయించుకున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వ్యాక్సిన్ల తయారీ యత్నాలు జరుగుతున్నాయి. అందులో 10లోపే మూడోదశ ప్రయోగాలకు చేరాయి.మనదేశంలో.. భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్లపైనా బోలెడు ఆశలున్నాయి. కానీ.. ఇన్నాళ్లుగా వీటి ప్రయోగాలకు సంబంధించిన శాస్త్రీయ సమాచారమేదీ ఎక్కడా ప్రచురితం కాలేదు.
 
ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌గా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఘనంగా చెప్పుకొన్న స్పుత్నిక్‌-వి ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇంకా ప్రపంచానికి వెల్లడించలేదు. ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాల వివరాలూ ఇంకా సైన్స్‌ ప్రపంచానికి అందలేదు.

ఈ క్రమంలో.. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ ఆ వివరాలను వెల్లడించిన తొలి సంస్థలుగా అన్నింటికన్నా ముందు నిలిచాయి. కాగా.. ‘మా వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలకు సంబంధించి తొలి దశ ఫలితాలు వెల్లడయ్యాయి. కొవిడ్‌-19ను అడ్డుకునే సామర్థ్యం మా వ్యాక్సిన్‌కు ఉందని అవి నిరూపించాయి’’ అని ఫైజర్‌ సీఈవో డాక్టర్‌ అల్బర్ట్‌ బౌర్లా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments