Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ క్షణమే జాదవ్‌ను ఉరితీసేలా ఆదేశాలివ్వండి : పాకిస్థాన్ సుప్రీంలో పిటీషన్

గూఢచర్యం ఆరోపణల కింద తమ వద్ద బందీగా ఉన్న భారత మాజీ నావికాధికారి కులభూషణ్ జాదవ్‌ను ఈ క్షణమే (సాధ్యమైనంత త్వరగా) ఉరి తీయాలని పాకిస్థాన్ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన

Webdunia
ఆదివారం, 28 మే 2017 (14:57 IST)
గూఢచర్యం ఆరోపణల కింద తమ వద్ద బందీగా ఉన్న భారత మాజీ నావికాధికారి కులభూషణ్ జాదవ్‌ను ఈ క్షణమే (సాధ్యమైనంత త్వరగా) ఉరి తీయాలని పాకిస్థాన్ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.
 
నిజానికి జాదవ్ ఉరిపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. ఈ తీర్పుతో పాకిస్థాన్ పాలకులు షాక్‌కు గురయ్యారు. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జాదవ్‌ను తక్షణం ఉరితీసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, మాజీ సెనేట్ ఛైర్మన్ ఫరూక్ నయీక్ పేరిట న్యాయవాది ముజామిల్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
 
వెంటనే జాదవ్‌ను ఉరితీసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరగా, దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని 'డాన్' పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఎలాంటి తీర్పునిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments