Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో గాలి ఆడట్లేదని.. టేకాఫ్ అవుతుండగా కిటికీలు తెరిచేశాడు..

చైనాలోని మిన్యాంగ్ నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణీకుడు జనాలను బెంబేలెత్తింపజేశాడు. గాలి ఆడట్లేదని విమానం కిటికీలను తెరిచాడు. దీంతో కంగారుపడిన సిబ్బంది టేకాఫ్ అర్థాంతరంగా ఆపేశారు. కిటికీలు తెరిచి

Webdunia
బుధవారం, 2 మే 2018 (14:07 IST)
చైనాలోని మిన్యాంగ్ నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణీకుడు జనాలను బెంబేలెత్తింపజేశాడు. గాలి ఆడట్లేదని విమానం కిటికీలను తెరిచాడు. దీంతో కంగారుపడిన సిబ్బంది టేకాఫ్ అర్థాంతరంగా ఆపేశారు. కిటికీలు తెరిచిన ప్రయాణీకుడిని సిబ్బంది పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని మిన్యాంగ్‌ నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌లో చెన్ (25) విమానంలోని అత్యవసరం ద్వారం వద్ద సీట్లో కూర్చున్నాడు. 
 
సరిగ్గా టేకాఫ్ అవుతుండగా.. ఉన్నట్టుండి కిటికీ తెరిచాడు. దీంతో విమానంలోకి గాలి చొచ్చుకురావడంతో సిబ్బంది అప్రమత్తమైంది. కిటికీలను మూతబెట్టి.. టేకాఫ్‌‌ను అర్ధాంతరంగా ఆపేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. విచారణలో కిటికీలు తెరిస్తే గాలి వస్తుందని అలా చేశానన్నాడు. దీంతో 15 రోజుల పాటు విమాన ప్రయాణాలు చేయకుండా ఆ యువకుడిపై నిషేధం విధించడంతోపాటు 70వేల యెన్‌లను జరిమానా విధించినట్లు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments