శవాలతో లైంగిక వాంఛ తీర్చుకుంటున్న కామాంధులు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (11:31 IST)
మన శత్రుదేశంగా ఉన్న పాకిస్థాన్ అన్ని విధాలుగా దిగజారిపోతుంది. అలాగే, మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆ దేశంలోని కామాంధులు చివరకు శవాలను కూడా వదిలిపెట్టడం లేదు. సమాధుల్లోని శవాలను వెలికి తీసి అత్యాచారం చేస్తున్నారు. సమాధులు తవ్వి మరీ, మహిళల మృతదేహాలను వెలికి తీసి, లైంగిక అకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు పాకిస్థాన్‌లో ఎక్కువయ్యాయి. 
 
ఇలా సమాధులు తవ్వి, శవాలపై ఆత్యాచారాలు చేస్తున్న ఘటనలు పెరిగిపోతుండడంతో, అమ్మాయిల తల్లిదండ్రులు అప్రమత్తం అయ్యారు. కామాంధులు తమ కుమార్తెల సమాధులను తవ్వి, మృతదేహాలను వెలికితీయకుండా, ఆ సమాధుల చుట్టూ ఇనుపకంచెలు, గ్రిల్స్ వంటి నిర్హాణాలతో రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మీడియా సంస్థ డైలీ టైమ్స్ ఓ కథనం వెలువరించింది. 
 
కుమార్తెలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు ఇప్పుడు వారి మానాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారిందని, ఇలా సమాధుల చుట్టూ కంచెలు వేసుకోవాల్సి రావడం దేశానికే సిగ్గుచేటు అని ఈ పత్రిక పేర్కొంది. శవాలతో లైంగిక వాంఛలు తీర్చుకోవడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఇదొక మానసిక వైపరీత్యం. పాకిస్థాన్‌లో ఇది కొత్త కాదు. 
 
2011లో ముహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని ఉత్తర నజీమాబాద్‌లో అరెస్ట్ చేయగా, సంచలన నిజాలు బయటపడ్డాయి. అతడు 48 మంది మహిళల శవాలను సమాధుల నుంచి వెలికి తీసి, వాటిపై అఘాయిత్యాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. రిజ్వాన్ శ్మశానంలో పనిచేసేవాడు. ఎవరైనా అమ్మాయి శవాన్ని ఖననం చేస్తే, అతడు ఆ సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికి తీసేవాడు. ఆపై తన కోరిక తీర్చుకునేవాడు. తాజాగా డైలీ టైమ్స్ కథనంతో నెక్రోఫిలియా అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం