Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవాలో జరిగే SCO meetకు Bilawal Bhutto Zardari.. పాక్ ప్రకటన

Bilawal Bhutto Zardari
, గురువారం, 20 ఏప్రియల్ 2023 (17:03 IST)
Bilawal Bhutto Zardari
భారత్‌లో జరిగే SCO సమావేశానికి పాకిస్థాన్‌కు చెందిన బిలావల్ భుట్టో జర్దారీ హాజరు కానున్నారు. మేలో గోవాలో జరిగే ఎస్సీఓ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశానికి పర్యటించే తొలి పాకిస్థాన్ నేత బిలావల్ భుట్టో కావడం విశేషం. 
 
వచ్చే నెలలో భారత్‌లో జరిగే షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశంలో విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పాల్గొంటారని పాకిస్తాన్ ఏప్రిల్ 20న ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
 
"మే 4-5, 2023 తేదీలలో భారతదేశంలోని గోవాలో జరిగే SCO కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (CFM)కి పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వం వహిస్తారు" అని ముంతాజ్ పేర్కొన్నారు. SCO సమావేశానికి హాజరు కావాల్సిందిగా విదేశాంగ మంత్రి S. జైశంకర్‌ని ఆహ్వానించినందున పాక్ విదేశాంగ మంత్రి ఈ సమావేశానికి హాజరవుతారని ఆమె తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుద్ధుని బోధనలు ప్రపంచ సమస్యలకు పరిష్కారం : ప్రధాని నరేంద్ర మోడీ