Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం సరిహద్దులను దాటి వచ్చిన పాక్ యువతి... తర్వాత ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (10:56 IST)
ప్రస్తుతం దేశాంతర, ఖండాంతర వివాహాలు కొత్తేమి కాదు. తాజాగా రెండు శత్రు దేశాలకు చెందిన యువతీయువకులకు పెళ్లి జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి తన ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులను దాటుకుని భారత్‌లోకి అడుగుపెట్టింది. ఇక్కడ తన ప్రియుడిని వివాహం చేసుకుంది. ఈ విషయం బయటకు పొక్కడంతో భద్రతా బలగాలు ఆ యువతిని అదుపులోకి తీసుకుని మళ్లీ పాకిస్థాన్ సరిహద్దు భద్రతా బలగాలకు అప్పగించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇఖ్రా జీవానీ అనే ఓ పాకిస్థాన్‌కు చెందిన 19 యేళ్ల యువతి ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ములాయం సింగ్ అనే 26 యేళ్ల యువకుడితో పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అతన్ని వివాహం చేసుకునేందుకు ఆ యువతి సరిహద్దులను దాటి వచ్చింది. ఇందుకోసం ఆమె ఎన్నో కష్టాలుపడింది. 
 
ముందుగా పాకిస్థాన్ నుంచి నేపాల్‌కు చేరుకుంది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు తన ప్రియుడిని రప్పించి అతన్ని కలుసుకుంది. మనసు విప్పి మాట్లాడింది. వారిద్దరూ అక్కడే పెళ్లి చేసుుకున్నారు. ఆ తర్వాత సరిహద్దు ప్రాంతమైన సనోలీ ప్రాంతం మీదుగా భారత్‌‍లోకి అడుగుపెట్టారు. 
 
ములాయం కొన్నేళ్లుగా బెంగుళూరులో ఉంటున్నాడు. దీంతో ఇఖ్రా కూడా భర్తతో వెళ్లి అక్కడే కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. పైగా, ఇఖ్రా తన పేరును హిందూ పేరును తలపించేలా రవా అని మార్చుకుంది. అయితే, ఆమె నమాజ్ చేస్తుండటంతో ఇరుగపొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
దీంతో ఇఖ్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె వద్ద లోతుగా విచారణ జరిపారు. ఈ విచారణంలో అసలు నిజం చెప్పారు. దీంతో ఆ యువతిని పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌కు తరలించారు. అక్కడ నుంచి అట్టారీ బోర్డర్ నుంచి పాకిస్థాన్‌కు తిప్పిపంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments