Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కోసం చంద్రుడిపై ఎకరం స్థలం కొనుగోలు చేసిన భర్త..! (video)

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (16:38 IST)
ప్రేమ కోసం కొందరు విలువైన కానుకలు ఇస్తూ వుంటారు. మరికొందరు భార్య కోసం కానుకలు ఇస్తూ వుంటారు. చాలామంది నచ్చిన వ్యక్తులకు విలువైన గిఫ్ట్‌లు ఇవ్వడం చేస్తుంటారు. ప్రస్తుతం మనం మాట్లాడబోయేది రెండో రకానికి చెందిన వ్యక్తి గురించి. గతంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌కు గ్రహాలపై స్థలాలు కొనుగోలు చేయడం అంటే చాలా ఆసక్తి. 2018లో సుశాంత్ సింగ్ మారే ముస్కోవిన్స్ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశాడు. ఈ ఇన్స్పిరేషన్‌తో చాలామంది స్థలాలు కొనుగోలు చేశారు
 
తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఏకంగా ఎకరం స్థలం గిఫ్ట్‌గా ఇచ్చాడు. అదీ భూమిపై కొన్న స్థలం కాదు, చంద్రునిపై కొన్న స్థలం. చంద్రునిపై స్థలం కొనుగోలు చేయడం వలన ఉపయోగం లేకపోయినా.. భవిష్యత్తులో చంద్రునిపై మనుషులు ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. 
 
పాకిస్తాన్‌లోని రావల్పిండికి చెందిన సొహైబ్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్యకు సి ఆఫ్ వేపర్ అనే ప్రదేశంలో ఓ ఎకరం స్థలం కొనుగోలు చేశాడు. దీని ధర రూ.3300 ఉన్నట్టు అహ్మద్ తెలిపారు. ఇంటర్నేషనల్ ల్యూనార్ ల్యాండ్ రిజిస్ట్రీలో ఈ స్థలం కొనుగోలు చేశాడు. 
 
ఈ సంస్థ నుంచి ల్యాండ్‌కు సంబంధించిన ఒరిజినల్ డాకుమెంట్స్ ఇటీవలే అహ్మద్‌కు అందడంతో వాటిని తన భార్యకు గిఫ్ట్‌గా అందించాడు. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్‌కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చంద్రునిపై కొన్న స్థలాన్ని భార్యకు వెడ్డింగ్ డే గిఫ్టుగా సోహైబ్ ఇచ్చాడట. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments