Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నమ్మ జ్ఞాపకార్థం రూ.1.25 కోట్లు ఖర్చు పెట్టిన విందు ఇచ్చిన బెగ్గర్ ఫ్యామిలీ.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 19 నవంబరు 2024 (16:06 IST)
చనిపోయిన తమ నాన్నమ్మ జ్ఞాపకార్థం పాకిస్థాన్‌కు చెందిన బెగ్గర్ ఫ్యామిలీ ఆ దేశ కరెన్సీ ప్రకారం రూ.1.25 కోట్లు ఖర్చు చేసి 20 వేల మందికి విందు భోజనం ఏర్ాటు చేశారు. పైగా, ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు 2 వేల వాహనాలను కూడా  ఏర్పాటు చేశారు. ఈ బిచ్చగాడి కుటుంబం పాకిస్థాన్ దేశంలోని గుజ్రన్‌వాలాలో ఉంది. గుజ్రాన్వాలాలోని రాహవలి రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ఈ విందును ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బిచ్చగాడు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విందు ఏర్పాటు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
 
పంజాబ్ ప్రావిన్స్‌లోని ఈ ప్రాంతంలో ఇటీవల బిచ్చగాడి నానమ్మ చనిపోయింది. 40వ రోజు ఆమె జ్ఞాపకార్థం భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు తమకు తెలిసిన వారందరినీ ఆహ్వానించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది వచ్చారు. మరో ఆసక్తికర అంశం ఏమంటే అతిథులను వేదిక వద్దకు తరలించేందుకు దాదాపు 2 వేల వాహనాలను ఏర్పాటుచేశారు. ఈ విందులో వారి సంప్రదాయ వంటకాలైన సిరి పాయా, మురబ్బాలతో పాటు మాంసాహారం ఉండేలా చూసుకున్నారు. మటన్, స్వీట్ రైస్ కూడా పెట్టారు. ఈ విందు కోసం 250 మేకలను వధించినట్లుగా స్థానిక మీడియా కథనాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments