Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగవారితో వ్యభిచారం.. పాకిస్థాన్ యువకుడి నిర్వాకం.. ఎక్కడ?

సాధారణంగా వ్యభిచారవృత్తిలో అమ్మాయిలు నిమగ్నమవుతుంటారు. కానీ, ఇక్కడ ఉపాధి కోసం వెళ్లిన ఓ యువకుడు వ్యభిచారాన్నే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తూ వచ్చాడు. చివరకు తన వద్దకు వచ్చిన ఇద్దరు విటులతో పాటు వారిద్ద

Webdunia
సోమవారం, 3 జులై 2017 (08:39 IST)
సాధారణంగా వ్యభిచారవృత్తిలో అమ్మాయిలు నిమగ్నమవుతుంటారు. కానీ, ఇక్కడ ఉపాధి కోసం వెళ్లిన ఓ యువకుడు వ్యభిచారాన్నే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తూ వచ్చాడు. చివరకు తన వద్దకు వచ్చిన ఇద్దరు విటులతో పాటు వారిద్దరితో వ్యభిచారం చేసిన నేరానికి పాక్ యువకుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన దుబాయ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పాకిస్థాన్‌కు చెందిన 22 యేళ్ళ యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ కార్మికుల వసతి గృహాల్లో నివశిస్తూ వచ్చాడు. అయితే, ఈ గృహాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు గమనించిన ఇతర కార్మికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొంతకాలంగా గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచారాన్ని రట్టు చేశారు. 
 
కార్మికులు ఉండే ఓ ఇంటిలో పాక్ యువకుడు వ్యభిచారం చేస్తున్నట్టు గుర్తించారు. రూ.350 (20 దినార్లు) తీసుకుని మగవారితో శృంగారంలో నిమగ్నమై ఉన్న సమయంలో పోలీసులు వెళ్లి ఆ యువకుడిని అరెస్టు చేశారు. అలాగే, అతడితో సెక్సులో పాల్గొన్న 26, 30 ఏళ్ల వయస్సున్న విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. 
 
విచారణ జరిపిన న్యాయస్థానం వ్యభిచారం చేస్తున్న యువకుడికి 6 నెలల జైలుశిక్ష విధించింది. మిగతా నిందితులిద్దరికీ చెరో రూ.3500 జరిమానా, 2 నెలల జైలుశిక్ష విధించింది. వీరికి శిక్షాకాలం పూర్తైన అనంతరం దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుని పటాలపై రాజమౌళి, మహేష్ బాబు సినిమా పూజతో ప్రారంభం

రేవ్ పార్టీలో నటి హేమ ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నారా..? కోర్టు కామెంట్స్ ఏంటి?

దివ్వెల మాధురి డ్యాన్స్ వీడియో.. ట్రోల్స్ మొదలు.. (video)

జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మంచిదే.. జానీ మాస్టర్ దంపతులు (video)

Little chitti Babu: ఎంత సక్కగున్నావె పాటకు బుడ్డోడి సాంగ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments