Webdunia - Bharat's app for daily news and videos

Install App

హౌస్ ఓనర్ కుమార్తెపై వాచ్‌మెన్ అత్యాచారం...

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (20:10 IST)
జీవనాధారం కోసం దుబాయ్ వెళ్లిన ఓ పాకిస్థాన్ యువకుడు చేసిన నీచమైనికి పాల్పడ్డాడు. తాను పని చేస్తున్న ఇంటి యజమాని కుమార్తెపై పలుమార్లు అత్యాచానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
21 సంవత్సరాల వయస్సు గల పాకిస్థాన్ యువకుడు ఉద్యోగం కోసం దుబాయ్‌కి వలసపోయాడు. ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ పనిలో చేరాడు. ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో ఓ మహిళ తన తల్లితో పాటు మానసిక వైకల్యంతో బాధపడుతున్న 18 సంవత్సరాల వయస్సు గల కూతురితో నివాసం ఉంటోంది. 
 
అయితే ఆ ఇంటికి డూప్లికేట్ తాళాన్ని సిద్ధం చేసుకున్న అతను ఆమె తన తల్లితో పాటు బయటకు వెళ్లినప్పుడు, ప్లాట్ తలుపులు తీసుకుని లోపలికి వెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు గత కొన్ని నెలలుగా ఈ నీచానికి పాల్పడుతున్నాడు.
 
కూతురు కొన్నాళ్లుగా మరీ దిగులుగా ఉండటాన్ని గమనించిన తల్లి, దగ్గర కూర్చుని ఓదార్చుతూ కారణం అడిగింది. ఆమె తెలిసీ తెలియని మాటలతో రోజూ ఓ వ్యక్తి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడని చెప్పింది. దీంతో తల్లి ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
గతేడాది ఆగస్టు నెలలో అల్ రాఫా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో ఆ యువతి అతడిని చూసి భయపడిపోయింది. చివరకు ఆ పాక్ యువకుడు తన తప్పును ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు ఫిబ్రవరి 20వ తేదీన వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments