Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి, భారత ఎంబసీకి థ్యాంక్స్ చెప్పిన పాక్ బాలిక (video)

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (14:03 IST)
Pak Girl
రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించటానికి భారత్ ప్రభుత్వం 'ఆపరేషన్ గంగ'ను చేపట్టిన విషయం తెలిసిందే. అలా ఇప్పటికే వేలాదిమంది విద్యార్దులతో సహా భారతీయుల్ని తరలించింది భారత ప్రభుత్వం. 
 
ఈ క్రమంలో భారత్‌కు సరిహద్దు దేశం, దాయాది దేశమైన పాకిస్థాన్‌కు చెందిన బాలికను కూడా భారత్ ఎంబసీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. దీంతో సరు పాకిస్థాన్ బాలిక ప్రధాని మోదీకి, భారత రాయబారకార్యాలయానికి ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
యుక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో యుక్రెయిన్ లోని కీవ్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్టు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన ఆ బాలిక పేరు ఆస్మా షఫీక్. ఆ వీడియోలో బాలిక మాట్లాడుతూ.. కీవ్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments