Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్ధమాన్‌ను పాకిస్థాన్ అందుకే విడుదల చేసింది.. ఎంపీపై దేశద్రోహం కేసు

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (14:54 IST)
భారత్‌ తమపై దాడి చేస్తుందని భయంతో వణికిపోయి.. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్థాన్ విడుదల చేసిందని చెప్పిన ఎంపీ అయాజ్‌ సాధిఖ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయనపై దేశవ్యాప్తంగా పోలీసులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని.. ఈ నేపథ్యంలో దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రి ఎజా షా తెలిపారు.
 
సాదిఖ్‌ను ద్రోహిగా పేర్కొంటూ లాహోర్‌లో గోడపత్రికలు సైతం వెలిశాయి. దీనిపై ప్రతిపక్ష పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాజకీయ కక్ష సాధింపుతోనే ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం దేశద్రోహం కేసులు నమోదుచేస్తోందని ఆరోపించింది.
 
మరోవైపు అభినందన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సాధిఖ్‌ ఉద్ఘాటించారు. తానెప్పుడూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. గతంలో జాతీయ భద్రత కమిటీకి అధిపతిగా వ్యవహరించిన తన వద్ద అనేక రహస్యాలు ఉన్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments