వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. డిలీట్ ఫర్ ఆల్ ఆప్షన్‌కు..?

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (14:46 IST)
ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ రోజు రోజుకూ సరికొత్త అప్‌డేట్స్‌తో యూజర్ల ముందుకొస్తోంది. వినియోగదారుల సమాచార భద్రతే ప్రాధాన్యంగా రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్ ప్రకారం మీరు పొరపాటున అవతలి వ్యక్తికి పంపిన వీడియోలను, టెక్ట్స్ మెసేజెస్, ఇమేజెస్, ఫైల్స్, ఎమోజీలను నియమిత సమయంలో అవతలి వ్యక్తి అకౌంట్ నుండి డిలీట్ చేసే అవకాశం ఉంది. ఆ నిర్ణీత సమయం తర్వాత 'డిలీట్ ఫర్ ఆల్' ఆప్షన్ పనిచేయదు. 
 
దీన్ని అధిగమించడానికి మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తులు చేస్తుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఇక నుంచి మీకు వచ్చిన పర్సనల్ మెసేజెస్, గ్రూప్స్ మెసేజెస్ ఏడు రోజుల వరకే కన్పిస్తాయి. ఆ తర్వాత ఆయా మెసేజెస్ మీ వాట్సాప్ హిస్టరీ కనిపించవు. దీనికి సంబంధించిన నూతన మెసేజ్ ఫీచర్ను అధికారికంగా ధృవీకరించింది వాట్సాప్. 
 
ఈ నూతన మెసేజింగ్ ఫీచర్ను వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, కైయోస్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులో ఉంచనుంది. అయితే, ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులో రానున్న విషయాన్ని మాత్రం వాట్సాప్ స్పష్టతనివ్వలేదు. అయితే, ఈ కొత్త ఫీచర్తో మీకు వచ్చిన మెసేజెస్ను ఇతరులకు పంపిస్తే అటువంటి మెసేజెస్ మాత్రం అదృశ్యం కావని సంస్థ హెచ్చరించింది.
 
ఒకవేళ, మెసేజెస్ అదృశ్యం కాకముందే వాట్సాప్ వినియోగదారుడు బ్యాకప్‌ను క్రియేట్ చేస్తే, అదృశ్యమైన మెసేజెస్ బ్యాకప్‌లో చేర్చబడుతాయని పేర్కొంది. అంతేకాక, మీ వాట్సాప్ ఆటోడౌన్లోడ్ స్విచ్ ఆన్ మోడ్లో ఉంటే, మీకు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఫైల్ గ్యాలరీలో సేవ్ అవుతాయి. కానీ, మీ చాట్ హిస్టరీ నుండి ఆయా మెసేజెస్ ఫైళ్లు మాత్రం డిలీట్ కావని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ బడా ముసలి నిర్మాతపై కంపు.. ఆ హీరోయిన్ మమ్మల్ని మంచం కింద దాక్కోమంది.. జేడీ చక్రవర్తి

Tamannaah: తమన్నాతో బ్రేకప్.. ఆలియా ఖురేషితో విజయ్ వర్మ లవ్వాయణం

Nag Ashwin: నలభై ఏళ్ళనాటి కథతో నాగ్ అశ్విన్ నిర్మాతగా ఎస్.ఎస్.ఆర్.61

అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం

ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్‌కార్ట్‌నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం

నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

తర్వాతి కథనం
Show comments