పాకిస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు పాజిటివ్.. ప్రధాని ఇమ్రాన్‌కు పరీక్షలు

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (11:15 IST)
కరోనా బాధిత దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ఈ దేశంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇపుడు ఆ దేశ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్‌కి కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అలాగే, ఈయన కుమారుడు, కుమార్తెకు కూడా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఖైసర్‌ కొనసాగుతున్నారు. ఈయన కరోనా లక్షణాలతో బాధపడుతుంటే గురువారం పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో కరోనా‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖురేషీతోపాటు ఆయన కుటుంబసభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. 
 
అయితే, స్పీక‌ర్ ఖురేషి రెండు రోజుల క్రితం ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌తో స‌మావేశం కావ‌డం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. దీంతో ముందు జాగ్రత్తగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్పీకర్ ఖురేషి‌ ఎవరెవరిని కలిశారో గుర్తించి అంద‌రినీ క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. 
 
మరోవైపు, పాకిస్థాన్‌లో ప్రస్తుతం మొత్తం 16819 నిర్ధారణ కేసులు ఉన్నాయి. అలాగే, 385 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా 4315 మంది చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3.26 మిలియన్ కేసుల నమోదుకాగా, 233 వేల మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments