Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్ ప్రధానికి కరోనా భయం పట్టుకుంది.. ఎందుకంటే?

పాకిస్థాన్ ప్రధానికి కరోనా భయం పట్టుకుంది.. ఎందుకంటే?
, శుక్రవారం, 1 మే 2020 (09:44 IST)
పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖురేషీ కరోనా వైరస్ బారిన పడటంతో.. పాకిస్థాన్ ప్రధాన మంత్రికి కరోనా భయం పట్టుకుంది. గురువారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాక్ అసెంబ్లీ స్పీకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో పాకిస్థాన్ ప్రధానికి కరోనా భయం పట్టుకుంది. 
 
కరోనా పాజిటివ్‌గా తేలిన అసద్‌.. రెండు రోజుల క్రితం ఇమ్రాన్‌ కలవడమే ఇందుకు కారణం. దీంతో ముందస్తు జాగ్రత్తంగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక స్పీకర్ ఖురేషీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు.
 
మరోవైపు స్పీకర్‌ ఎవరెవరిని కలిశారు అనేది గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. ఆయనకు దగ్గరగా మెలిగిన వారిని గుర్తించి క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు. కాగా ఇమ్రాన్‌కు ఇదివరకే ఓసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది. ఇక పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు పాకిస్థాన్‌లో 16,353 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.
 
పవిత్ర రంజాన్‌ మాసం కావడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో 1993 కరోనా పాజిటివ్ కేసులు.. 73మంది మృతి