Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ వేళ - పాకిస్థాన్‌లో లాక్‌డౌన్ పొడగింపు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:35 IST)
ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసమైన రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ పవిత్రమాసం ప్రారంభమైన తరుణంలో పాకిస్థాన్ దేశంలో లాక్‌డౌన్‌ను మరో 15 రోజుల పాటు పొడగించారు. అంటే.. మే 9వ తేదీ వరకు ఇది అమల్లోవుండనుంది. 
 
కాగా, కరోనా బాధిత దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి. ఇక్కడ సుమారుగా 12 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సుమారు 250 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రంజాన్ నెల మ‌ధ్య వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి అస‌ద్ తెలిపారు. 
 
వైర‌స్ పోరాటంలో కీల‌క ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో లాక్‌డ‌న్ పొడ‌గించాల్సి వ‌చ్చింద‌న్నారు. లాక్‌డౌన్‌ను మ‌రో 15 రోజుల పాటు అంటే మే 9వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌ణాళిక‌, అభివృద్ధిశాఖ మంత్రి అస‌ద్ ఒమ‌ర్ తెలిపారు.  
 
మరోవైపు, మసీదుల్లో భారీ సంఖ్యలో జనం కూడటంపై మరో మంత్రి పీర్ నూర్ అల్ హక్ తీవ్రంగా మండిపడ్డారు. మ‌సీదుల్లో మ‌త‌పెద్ద‌లు సామాజిక దూరాన్ని పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 
 
ఒక‌వేళ క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌ల‌మైతే, మ‌తసంస్థ‌లే నింద మోయాల్సి వ‌స్తుంద‌ని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్ ప్ర‌భుత్వం అధికారికంగా రంజాన్ నెల ప్రారంభాన్ని ప్ర‌క‌టించ‌క‌ముందే.. పెషావ‌ర్‌లోని ముఫ్తీ ఖాసిమ్ అలీ ఖాన్ మ‌సీదులో ప్రార్థ‌న‌లు మొద‌లుకావ‌డం ప‌ట్ల కూడా మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments