Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

ఠాగూర్
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (12:30 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పైశాచిక దాడికి పాల్పడగా సుమారు 38 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి కారణం కూడా పాకిస్థాన్ కావడం గమనార్హం. సరిహద్దుల్లో ఉన్న ఎయిర్ బేస్‌లకు పాకిస్థాన్ తన యుద్ధ విమానాలను తరలించడంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలను నెటిజన్లు ఫ్లైట్ రాడార్ డేటాకు సంబంధించిన క్లిప్పింగులను పోస్టు చేసున్నారు. 
 
ఫ్లైట్ రాడార్ డేటాలో పాకిస్థాన్ వాయుసేన విమానాలు కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని ఉత్తర వైమానిక స్థావరాలకు చేరుకుంటున్నట్టు కనిపిస్తుంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం పాకిస్థాన్‌ అతి ప్రధానమైన ఆపరేషనల్ బేస్‌లలో ఒకటి. ఈ నేపథ్యంలోనే బేస్ భద్రతా ఏర్పాట్లను పాక్ పటిష్టం చేసినట్టు ప్రచారం సాగుతోంది. అయితే, సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపు వార్తలపై అటు పాకిస్థాన్‌గానీ ఇటు భారత అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments