Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో యుద్ధం వస్తే సత్తాచాటుతామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఫ్యాంటు జారిపోయింది...

భారతదేశంపై రెచ్చగొట్టుడు వ్యాఖ్యానాల పర్యవసానాలు ఎలా ఉంటాయో బుధవారం నాటి నుండి పాకిస్థాన్ రుచిచూస్తోంది. దీంతో పరువు నిలుపుకోవడం కోసం నానా తంటాలు పడుతోంది. భారత్‌తో యుద్ధమే వస్తే సత్తా చూపుతామంటూ ప్రగ

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (09:50 IST)
భారతదేశంపై రెచ్చగొట్టుడు వ్యాఖ్యానాల పర్యవసానాలు ఎలా ఉంటాయో బుధవారం నాటి నుండి పాకిస్థాన్ రుచిచూస్తోంది. దీంతో పరువు నిలుపుకోవడం కోసం నానా తంటాలు పడుతోంది. భారత్‌తో యుద్ధమే వస్తే సత్తా చూపుతామంటూ ప్రగల్భాలు పలికే పాక్ రక్షణ మంత్రి క్వాజా మహ్మద్ ప్యాంట్ ఊడిపోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ స్ధావరాలపై భారత ఆర్మీ దాడులకూ… ఈ సంఘటనకూ ఏం సంబంధం లేకపోయినా… ప్యాంట్ సరిగ్గా ఉంచుకోవడం తెలియని పాక్ రక్షణ మంత్రి దేశాన్నేం రక్షిస్తాడంటూ ఈ వీడియోను ఉటంకిస్తూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత కమెండోలు మెరుపుదాడులు చేసి 38 మంది ముష్కరులను మట్టుబెట్టింది. ఈ విషయం తెలియగానే... పాకిస్థాన్ రక్షణ మంత్రి ప్యాంటు వీడిపోయిందని పేర్కొంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. నిజానికి ఈ వీడియో పాతదే. ఓ సందర్భంలో అతిథులను ఆహ్వానిస్తున్న ఖ్వాజా మహ్మద్ ప్యాంటు ఊడిపోయింది. 
 
దీంతో ఆయన తీవ్ర అవమానానికి గురయ్యారు. ఇప్పుడు ఇది బయటికి రావడంతో.. ఒంటి మీద ప్యాంటునే కాపాడుకోలేని మంత్రి అణ్వస్త్రాలు వేస్తామంటూ భారత్‌‌ను బెదిరిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లపైన కామెంట్లు విసురుతున్నారు. అయితే.. ఈ వీడియో భారత్‌లో మాత్రమే హల్ చల్ చేస్తుందని అనుకుంటే.. పొరపాటే. ఇది పాకిస్థాన్ నుండి రావడం విశేషం. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments