Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైన్యం వెంటే కాంగ్రెస్‌.. శభాష్ మోడీజీ... మీ సర్కార్‌కు మా సంపూర్ణ మద్దతు : సోనియా

భారత సైన్యం వెంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లో భారత సైన్య మెరుపుదాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. అదేసమయంలో దేశ భద్రత కోసం ప్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (09:47 IST)
భారత సైన్యం వెంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లో భారత సైన్య మెరుపుదాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. అదేసమయంలో దేశ భద్రత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆమె ప్రకటించారు. ఈ దాడుల ద్వారా పాక్‌కు గట్టి సందేశం పంపామన్నారు. చొరబాట్లకు, మన ప్రజలపై, సైన్యంపై దాడులకు దిగితే భారత తగిన సమాధానం చెబుతుందని తెలియజేశామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 
 
అదేవిధంగా రాహుల్‌ గాంధీ కూడా సైన్యాన్ని అభినందించారు. ‘‘దేశాన్ని, మనను రక్షించేందుకు వీరోచితంగా పోరాడుతున్న మన జవాన్లకు కాంగ్రెస్‌ పార్టీ, నేను సెల్యూట్‌ చేస్తున్నాం. జై హింద్‌’’ అని ట్వీట్‌ చేశారు. అంతకుముందు.. సోనియా గాంధీతో విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ భేటీ అయ్యారు. పీవోకేలో భారత దాడులపై వివరించారు. ఉగ్రవాదం అంతం దిశగా ప్రభుత్వం చేపట్టే అన్ని చర్యలకూ మద్దతిస్తామని సుష్మకు సోనియా భరోసా ఇచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

పుష్ప జాతర సీన్ కు మించి కొత్తపల్లిలోఒకప్పుడు చిత్రంలో వుంది : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

సుబోధ్ భావే తో ఆదిత్య ఓం తెరకెక్కించిన సంత్ తుకారాం సిద్ధమైంది

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments