Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న డాక్టర్లపై లాఠీఛార్జ్.. పాక్ పాడు బుద్ధి..

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (13:52 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ పాడు బుద్ధి మారట్లేదు. కరోనాపై వైద్యులు పోరాటం చేస్తున్నారు. కరోనా అనే రక్కసితో మహా యుద్ధం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూజింపవలసిన వైద్యులపై పాకిస్తాన్‌లోని బలుచిస్తాన్‌ రాష్ట్ర ప్రభుత్వం లాఠీఛార్జ్‌ చేసిందని వార్తలు వస్తున్నాయి. 
 
కరోనా వార్డులకు వెళ్లి రోగులకు చికిత్స చేసే డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్ల కొరత ఉంది. మా​స్కులు, గ్లౌజులు, చేతి తొడుగులు, పూర్థిస్థాయి గౌనులు అందుబాటులో లేవు. ఈ పీపీఈ కిట్లను అందించాలని గత కొన్ని వారాలుగా ప్రభుత్నాన్ని అక్కడి వైద్యులు కోరుతున్నారట. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆస్పత్రి ముందు నిరసన తెలపగా, పోలీసులు అడ్డుకొని లాఠీఛార్జ్‌ చేసి అరెస్ట్‌ చేశారని క్వెట్టా పట్టణ డాక్టర్ల సమాఖ్య అధ్యక్షుడు యాసీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
 
అయితే అక్కడి ప్రభుత్వ వాదన మాత్రం మరోలా ఉంది. అదేమంటే పీపీఈ కిట్ల కొరత ఉన్నది నిజమే, అయితే కిట్ల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ డాక్టర్లు, వైద్యసిబ్బంది ఓపిక పట్టకుండా నిరసన చేపట్టారు. 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. అందుకే అరెస్ట్ చేశామని బలూచిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. అయితే కరోనా నుంచి బాధితులను రక్షిస్తున్న వైద్యులను కాపాడాల్సిందిపోయి.. వారిపై లాఠీచార్జ్‌, అరెస్ట్‌ చేయడం దారుణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments