Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది దుర్మరణం.. 32మందికి గాయాలు

Webdunia
గురువారం, 20 మే 2021 (11:36 IST)
పాకిస్థాన్‌లోని సుక్కూర్‌ జిల్లా దక్షిణ సింద్‌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఘటనాస్థలంలోనే 13 మంది దుర్మరణం చెందగా.. 32 మందికిపైగా గాయాలయ్యాయి.
 
బస్సు ముల్తాన్‌ నుంచి కరాచీకి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు.
 
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సును క్రేన్‌ సాయంతో పైకి ఎత్తి వాహనంలో చిక్కుకుపోయిన వారిని అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సుక్కూర్‌ సివిల్‌ హాస్పటల్‌, పాలోఅకిల్‌ తాలూక హాస్పటళ్లకు తరలించారు.
 
గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారిని తరలిస్తున్న నేపథ్యంలో సుక్కూర్‌, రోహిర్‌ దవాఖానల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments