Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (14:44 IST)
ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రికతల కారణంగా కలవరపెట్టిన క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ట్రంప్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు 5 శాతం మేరకు తగ్గుముఖం పట్టాయి. 
 
ఈ ప్రకటన అనంతరం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.53 డాలర్లు లేదా 4.94 శాతం తగ్గుముఖం పట్టి 67.95 డాలర్ల ట్రేడవుతోంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ రకం కూడా 5 శాతం మేరకు క్షీణించి బ్యారెల్ 65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వారం కనిష్టానికి చేరాయి. 
 
కాగా, ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా కలిసిన విషయం తెల్సిందే. ఇరాన్ అణుస్థావరాలపై యూఎస్ దాడి చేసింది. దీంతో హర్మూజ్ జలసంధిని మూసివేత దిశగా ఇరాన్ అడుగులు వేసింది. ఇదే జరిగితే బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల దాటుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. దీనివల్ల ప్రధానంగా దిగిమతులపై ఆధారపడే మన దేశానికి ద్రవ్యలోటు వచ్చింది. మరోవైపు, ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కూడా దూసుకెళుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments