Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలియుగ ఋషి : ఘన పదార్థాలు బంద్... ఓన్లీ బీర్ అండ్ వాటర్

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (14:32 IST)
సాధారణంగా ఋషులు ఆహారపానీయాలు మానేస్తారనే విషయాన్ని పురాణాల్లోనే వింటూ ఉంటాం. కానీ ఓ వ్యక్తి ఆహారం పూర్తిగా బంద్ చేసేసి... కేవలం బీర్, నీళ్లు మాత్రమే పుచ్చుకోవడం చేసే ఒక పెద్ద మనిషిని ప్రస్తుతం ఫ్లోరిడాలో చూడవచ్చు. అయితే ఈ పెద్ద మనిషి చేసిన పని సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓహియోకు చెందిన డెల్‌హల్ అనే సదరు వ్యక్తి ఆర్మీ అధికారిగా పనిచేసారు. రిటైర్ అయిన తర్వాత ప్రజల్లో ప్రత్యేకంగా గుర్తింపు పొందాలని ఆశించారు. అయితే అందుకోసం ఏం చేయాలో అతడికి తెలియకపోవడంతో... ఓ రోజు ఎటువంటి ఘనపదార్థాలు తీసుకోకుండా కేవలం బీర్, నీళ్లు మాత్రమే తాగాడు. అలా నాలుగు రోజులు బీర్లు, నీళ్లు మాత్రమే అతడి ఆహారంగా మారింది. 
 
అలా నాలుగు రోజులు కాస్త 46 రోజులు అయ్యాయి. అన్ని రోజులు గడిచినా కూడా డెల్ కేవలం బీర్, నీళ్లు మాత్రమే తాగి బతుకేస్తున్నాడు. సోషల్ మీడియాలో డెల్ చేసే పని గురించి పోస్ట్ పెట్టాడు. చాలా మంది నెటిజన్లకు డెల్ చేస్తున్న పని పట్ల ఆసక్తి కలిగింది. కొంతమంది డెల్‌ను నమ్మని వ్యక్తులు అతడి వద్దకు వచ్చి మరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెల్ కేవలం బీర్, నీళ్లు మాత్రమే తాగుతున్నాడని వాళ్లు నిర్ధారించుకున్నారు కూడా. 
 
పుర్రెకో బుద్ధి అంటే ఇదేనేమో మరి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహా కుంభమేళా: సన్యాసం తీసుకున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (video)

ఫేక్ కలెక్షన్స్‌ ను ఇండస్ట్రీ మొత్తం సరిద్దుకోవాలి - బ్లాక్ మనీ లేదు: దిల్ రాజు ప్రకటన

దేవుడు ఉన్న చోట దెయ్యం ఉంటుంది అంటూన్న సుధీర్ బాబు

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ మరోసారి రాబోతుంది !

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments