Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని మనవరాలిపై అత్యాచారం.. గర్భవతి...

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (14:17 IST)
సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో జరిగింది. 60 యేళ్ల వృద్ధుడు కామంతో కళ్లుమూసుకునిపోయి 16 యేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఈ బాలిక మతిస్థిమితం లేని యువతి. పైగా ఆ వృద్ధుడుకి మనవరాలి వరుస. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మండలంలోని ఎం.ఉప్పలూరు గ్రామానికి చెందిన జి.పుల్లయ్య (60) వరుసకు మనవరాలు అయ్యే ఓ యువతి (16)పై కన్నేశాడు. మతిస్థిమితం లేకపోవడంతో ఆ బాలికను దగ్గరకు చేరదిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ నేపథ్యంలో ఆ బాలిక ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె ఆరో నెల గర్భవతి అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులు నిలదీయగా తానే లైంగికదాడికి పాల్పడ్డానని పుల్లయ్య అంగీకరించాడు. 
 
ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. యువతిని వైద్య పరీక్షల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం