Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యే భర్తకు మరో పెళ్లి చేసింది.. ఎక్కడ..?

Advertiesment
32 years
, బుధవారం, 13 మార్చి 2019 (13:19 IST)
ప్రతీ స్త్రీ తన భర్తకు మరో స్త్రీతో అక్రమ సంబంధం ఉందని తెలిస్తే.. ఒకటి పోలీసులకు తెలియజేస్తుంది లేదా ఇంట్లోని పెద్దలకు చెప్తుంది. కానీ ఇక్కడేమో భార్యే భర్తకు మరో పెళ్లి చేసింది. ఈ సంఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. వీటి వివరాల్లోకి వెళ్తే.. తన ఇంట్లో ఆశ్రయం పొందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పెయింటర్ ఉదంతం వెలుగుచూసింది.
 
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కారణంగా నా భర్తను పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో నిందితుడి భార్య ఆ బాలికతో భర్తకు బలవంతంగా వివాహం జరిగిపించింది. అసలు ఏం జరిగిదంటే.. పెయింటింగ్ పనులకు వెళ్లే గంగరాజును వదిలేసిన భార్య పల్లవి కొన్ని నెలల కిందట పెళ్లి చేసుకుని హునసికోట్‌లో నివాసం ఉంటున్నారు. గతవారం పల్లవికి వరుసకు సోదరి అయ్యే 13 ఏళ్ల బాలిక వారి ఇంటికి వచ్చి వారితో కలిసి ఉంటోంది.
 
బాలికను గమనించిన భర్త గంగరాజు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా.. బాలికను ఇలా బెదిరించాడు.. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించాడు. ఈ ఘటనలో ఇతని భార్యకు కూడా సంబంధం ఉంది. అయితే గ్రామంలో ఈ విషయం తెలియడంతో మలూర్‌లోని చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందింది. బాలికను పోలీసులు ప్రశ్నించగా భయంతో అలాంటిదేమి జరగలేదని చెప్పింది.
 
చైల్డ్ హెల్ప్‌లైన్‌కు మరో ఫిర్యాదు అందడంతో.. పోలీసులు కౌన్సెలర్, లీగల్ అడ్వైజర్‌‌ను తీసుకువచ్చి బాధితురాలైన బాలిక నుండి వివరాలు రాబట్టారు. ఇక బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు గంగరాజు, పల్లవిని అరెస్ట్ చేశారు.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీతో పాటు నేను కూడా పండుకుంటా.. అంటూ వచ్చిన పైథాన్.. (Video)