Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం... 59 మంది సజీవ దహనం!!

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (09:10 IST)
యూరప్ దేశంలోని నార్త్ మెసిడోనియాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. నైట్ క్లబ్‌లో సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది సజీవదహనమయ్యారు. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొకాని పట్టణంలోని పల్స్ నైట్ క్లబ్‌లో స్థానిక పాప్ బృందం కన్సర్ట్ నిర్వహిస్తుండగా సోమవారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో బాణాసంచా కాల్చడంతో పైకప్పునకు మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన పాప్ బృందం వెంటనే అక్కడ నుంచి అందరూ వెళ్లిపోవాలని కోరింది. దీంతో ఏం జరిగిందో అర్ధంకాక గందరగోళం మధ్యే యువతీయువకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ లోపే దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది యువతీ యువకులే. మరణించిన వారిలో ఇప్పటివరకు 39 మందిని గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై మెసిడోనియా ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఇది మెసిడోనియాకు విచారకరమని, చాలా మంది యువతీ యువకులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశానికి పూడ్చలేని నష్టంగా ఆయన అభివర్ణించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments