మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డులోని గొల్లపల్లి కలాన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
కనిష్క్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టిందని, అది వెనుక నుండి ఢీకొట్టిందని తెలుస్తోంది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ కనిష్క్ రెడ్డి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
కనిష్క్ రెడ్డి అకాల మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతని తల్లి తీగల సునరిత రెడ్డి, మూసారంబాగ్ నుండి మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కావడం గమనార్హం.