Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?

Advertiesment
bride

సెల్వి

, మంగళవారం, 4 మార్చి 2025 (22:51 IST)
ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. కొత్త పెళ్లి కొడుకు తండ్రి కావాలనే కల పెళ్లైన మూడో రోజే నెరవేరింది. అవును మీరు చదువుతున్నది నిజమే. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌లోని కార్చన తహసీల్‌కు చెందిన యువకుడు బంధువుల బృందం వివాహం చేసుకునేందుకు అమ్మాయి ఇంటికి ఫిబ్రవరి 24న జస్రా గ్రామానికి వెళ్ళింది. అమ్మాయి తరపు వాళ్లు ఘనంగా స్వాగతం పలికారు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి తర్వాతి రోజు ఫిబ్రవరి 25న వధువు వీడ్కోలు జరిగింది.
 
మరుసటి రోజు ఫిబ్రవరి 26 ఉదయం, కోడలు నిద్ర లేవగానే, ఆమె టీ తయారు చేసి అందరికీ పంపిణీ చేసింది. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంది. అదే రోజు సాయంత్రం అకస్మాత్తుగా వధువు ఏడవడం ప్రారంభించింది. ఆమె కడుపు నొప్పిగా ఉందని చెబుతూ కేకలు వేయడం ప్రారంభించింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే కార్చన సిహెచ్‌సికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించగా, ఆమె గర్భవతి అని తేలింది. 
 
పురిటి నొప్పులు వచ్చాయని చెప్పడంతో అందరూ షాకయ్యారు. దాదాపు 2 గంటల తర్వాత ఆ మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కొత్తగా పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చిన కోడలు మూడో రోజే బిడ్డకు తల్లిగా మారడంతో పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు అనుమానంతో పాటు ఆగ్రహం కట్టలు తెంచుకొని వచ్చింది. 
webdunia
Pregnant
 
అయితే అసలు సంగతి అక్కడే మొదలైంది. దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ, గత సంవత్సరం వివాహం నిశ్చయమైంది, పెళ్లికి ముందు నుంచే వరుడు తమ కూతురిని కలిసేవాడని చెప్పారు. గత ఏడాది మే నెలలో కూతురి వివాహం నిశ్చయించబడిందని అమ్మాయి తండ్రి తెలిపారు. 
 
కానీ పెళ్లికూతురు బిడ్డకు జన్మనివ్వడంతో పెళ్లి కొడుకు పూర్తిగా రివర్స్ అయ్యాడు. చివరికి ఇరు కుటుంబీకుల మధ్య జరిగిన పంచాయతీ చేసినా రాజీ కుదరకపోవడంతో నవ వధువు బిడ్డతో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ట్రక్ ట్రయల్స్‌తో టాటా మోటార్స్