Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో డ్రై క్లీనింగ్ వ్యాపారం చేస్తున్న ఉత్తర కొరియా నియంత పిన్ని

Webdunia
ఆదివారం, 29 మే 2016 (11:19 IST)
ఉత్తర కొరియా నియంత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పిన్న ప్రస్తుతం అమెరికాలో అజ్ఞాతవాసం గడుపుతోంది. ఆమె కుటుంబ పోషణ కోసం డ్రై క్లీనింగ్ వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. అయితే, ఆమె అక్కడ అజ్ఞాతవాసం గడపడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. 
 
ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు (ప్రస్తుత అధ్యక్షుడి తండ్రి) కిమ్ జోంగ్ - 2 భార్యల్లో ఒకరైన కో యంగ్ హుకు... కో యంగ్ సుక్ అనే సోదరి ఉంది. ఆమె తన భర్త రి గంగ్, ముగ్గురు పిల్లలతో కలసి అమెరికాలో అజ్ఞాత జీవితం గడుపుతోంది.
 
సాక్షాత్తూ అధ్యక్షుడి పిన్ని అయిన ఆమె కుటుంబపోషణ కోసం డ్రై క్లీనింగ్ వ్యాపారం చేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కిమ్ జోంగ్ ఉన్‌కు చిన్నప్పుడు బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టమని, ఆ బాల్‌ను పక్కన పెట్టుకుని నిద్రపోయేవాడని ఆమె గుర్తు చేసుకున్నారు.
 
చిన్నప్పటి నుంచి కిమ్ జోంగ్ ఉన్ కు కోపం ఎక్కువ, సహనం తక్కువని ఆమె తెలిపారు. అయితే ఉత్తరకొరియా నుంచి తాను కుటుంబంతో సహా అమెరికాకు ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు. అమెరికాలో ఆమె ఇల్లుకొనుక్కుని స్థిరపడగా, ఆమె పిల్లలు అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments