ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

ఠాగూర్
సోమవారం, 13 అక్టోబరు 2025 (17:40 IST)
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ పురస్కారాన్ని ఈ యేడాది నోబెల్ కమిటీ ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించింది. రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ 2025 సంవత్సరానికిగాను ముగ్గురికి దీనిని అందించనుంది. 'ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధి'ని వెల్లడించినందుకు జోయెల్‌ మోకిర్‌, ఫిలిప్‌ అఘియన్‌, పీటర్‌ హోవిట్‌ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
 
మోకిర్‌ అమెరికన్‌ - ఇజ్రాయెలీ ఆర్థికవేత్త కాగా, హోవిట్‌ కెనడా, అఘియన్‌ ఫ్రాన్స్‌కు చెందిన ఆర్థిక నిపుణులు. సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు మోకిర్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 'క్రియేటివ్‌ డిస్ట్రక్షన్‌' ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతానికిగానూ మిగతా ఇద్దరికి నోబెల్‌ ప్రకటించారు. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది.
 
కాగా, ఇటీవల నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనెజువెలా ప్రతిపక్ష నేతలా మరియా కొరియాకు నోబెల్ కమిటీ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆయనకు నోబెల్ కమిటీ నిరాశ మిగిల్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments