Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు పెళ్లిని రద్దు చేసుకున్న దేశ ప్రధాని

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (10:04 IST)
న్యూజిలాండ్ దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉంది. ముఖ్యంగా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపుగా ఉంది. పైగా, ఇటీవల జరిగిన ఓ వివాహం తర్వాత వైరస్ సామాజిక వ్యాప్తి అధికమైంది. దీంతో న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా అర్డెన్ తన వివాహాన్ని రద్దు చేసుకున్నారు. 
 
అలాగే, ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా మాస్క్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే, ప్రజలు గుమికూడటాన్ని నిషేధించింది. ఆదివారం అర్థరాత్రి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. 
 
కోవిడ్ 19 ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా న్యూజిలాండ్ ఇపుడు రెడ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంమది. బార్‌లు, రెస్టారెంట్లు, వివాహాలు వంటి కార్యక్రమాలకు కేవలం 100 మందికి మించి హాజరుకావడానికి వీల్లేదు. ఈ వేడుకల్లో వ్యాక్సినేషన్ పాస్‌లను ఉపయోగించకుంటే కనుకు ఈ సంఖ్య కేవలం 25కు పరిమితం అవుతుందని ప్రధాని జెసిండా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments