Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ ప్రయాణీకులపై తాత్కాలిక నిషేధం విధించిన న్యూజిలాండ్‌

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:52 IST)
న్యూజిలాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంలో భారత్‌ నుండి వచ్చే ప్రయాణీకులపై ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ రెండు వారాల పాటు తాత్కాలికంగా నిషేధం విధించారు. తమ దేశ ప్రజలకు కూడా ఇది వర్తించనుందని అక్లాండ్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

గురువారం న్యూజిలాండ్‌ సరిహద్దుల్లో చేపట్టిన పరీక్షలో 23 మందికి కరోనా సోకగా..అందులో 17 మంది భారత్‌ నుండి వచ్చిన వారే. దీంతో భారత్‌ నుండి న్యూజిలాండ్‌కు వచ్చే పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో కూడా సెకండ్‌ వేవ్‌ నడుస్తుండటంతో పాటు కొన్ని రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి విదితమే.

ఏప్రిల్‌ 11 నుండి... స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల నుండి ఏప్రిల్‌ 28 వరకు ఈ తాత్కాలిక నిషేధం విధించనుంది. ఈ సమయంలో ప్రయాణాలను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం పరిశీలించనుంది.

భారత్‌ నుండి వచ్చిన వారి ద్వారా కేసులు పెరుగుతున్నాయని, దేశంలోకి ప్రవేశించే పాయింట్ల వద్ద కేసులు నియంత్రించేందుకు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలో యోచిస్తున్నామని జెసిండా అన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments