ప్రకృతి అనేక వరాలను ప్రసాదించింది. ప్రకృతి మనిషికి ఇచ్చిన గొప్ప వరం నదులు. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పెద్ద అనేక నదులున్నాయి. అయితే ఎప్పుడూ మరిగే నది గురించి తెలుసా..? ఆ నది గురించి తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్ళాల్సిందే.
కెనెడా ప్రపంచంలోనే అత్యధికంగా నదులు కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. కానీ అన్ని నదుల విశిష్టతలను తలదాన్నెలా ఒక నది విశిష్టతను కలిగి ఉంది. ఆ నదిలో నీరు 24 గంటలూ మరుగుతూనే ఉంటుంది. ఈ బాయిలింగ్ నది అమెరికాలో అమెజాన్ ప్రదేశంలోని పెరు దేశంలో మయంటుయాకు ప్రాంతంలో వుంది.
అమేజాన్ ప్రదేశంలోని పెరు దేశంలో మయంటుయా ప్రాంతంలో సముద్ర తీరంలో ఈ నది వుంది. ఆ నది నీరు 24 గంటలు వేడిగానే ఉంటుంది. అందుకనే ఈ నదిని “బాయిలింగ్ రివర్” అని అంటారు. ఈ నది అడవి మధ్యన ఉంటుంది.. అయినా నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిత్యం మరిగిపోతూంటుంది.
ఈ నదిని 2011లో కనుగొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద థర్మల్ నది దాదాపు నాలుగు మైళ్ళ వరకు వేడిగా ప్రవహిస్తుంది. దాని వెడల్పు వద్ద 80 అడుగులు లోతు వద్ద 16 అడుగులు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నదిలో నీరు ఏ కాలమైన వేడిగా ఉంటుందని.. ఏ జంతువు ఈ నీటిలో పడినా బతకడం కష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు.