Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాపై కొరడా.. యూకే కొత్త బిల్లు.. తప్పుదారి పట్టిస్తే..?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (14:49 IST)
యూకే సర్కారు సోషల్ మీడియాపై కొరడా ఝుళిపించింది. సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని తప్పుదారి పట్టించే సమాచారానికి అడ్డుకట్ట వేసే దిశగా.. యూకే సర్కారు సిద్ధమైంది. హింస, ఉగ్రవాదం, ఆత్మహత్య , సైబర్ నేరాలు, సైబర్ బెదిరింపులు వంటి హానికరమైన విషయాల నుంచి ప్రజలను రక్షించే సాంకేతిక సంస్థలను నియంత్రించడానికి కొత్త బిల్లు ప్రవేశ పెట్టనుంది యూకే టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ సంస్థ ఆఫ్కామ్. 
 
అందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తప్పుదారి పట్టించే అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను నిషేధించడం తోపాటు దుర్మార్గానికి పాల్పడిన సంస్థలపై చర్యలు తీసుకోనే అధికారం యూకే టెలికమ్యూనికేషన్ రెగ్యులేటర్ ఆఫ్కామ్‌కు ఉంటుంది.
 
వచ్చే ఏడాది పార్లమెంటుకు సమర్పించబోయే కొత్త బిల్లు, యుకె ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ ఆన్‌లైన్ భద్రతా బిల్లు ప్రకారం వినియోగదారు సృష్టించిన కంటెంట్‌ను హోస్ట్ చేసే లేదా సోషల్ మీడియా సైట్‌లు, వెబ్‌సైట్‌లు, యాప్స్, ఇతర సేవలు అంటే ఆన్‌లైన్‌లో ఇతరులతో మాట్లాడటానికి అనుమతించే హానికరమైన కంటెంట్ వ్యాప్తిని తొలగించడంలో విఫలమైతే జరిమానా విధిస్తారు. ఆయా సంస్థల వార్షిక టర్నోవర్‌లో 18 మిలియన్ (24 మిలియన్ డాలర్లు) లేదా పది శాతం జరిమానా వేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments