బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇంకా ఒక వారమే కొనసాగనుంది. చివరి వారం తొలిరోజే బిగ్‌బాస్ ఫైనలిస్ట్‌ల మధ్య చిచ్చు పెట్టేందుకు ట్రై చేశాడు. కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ట్రోఫీ విజేతగా ఎందుకు అనర్హుడివి ఎవరూ అనర్హులు కారో డిసైడ్ చేయాలంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌తో మళ్లీ రచ్చమొదలవుతుందని బిగ్‌బాస్ ఎక్స్‌పెక్ట్ చేసినట్లు ఉన్నాడు. కానీ ఇంటిసభ్యులు ఈ టాస్క్‌ను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశారు. కాకపోతే ట్రోఫీ అన్‌ఫిట్‌కు అమ్మాయిల పేర్లే ఎక్కువగా వినిపించాయి.
ఈ టాస్క్‌లో మొదట అభి తన ఓపినియన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పటివరకు 'ఎక్కువ సార్లు నామినేట్ అయి సేఫ్ అయ్యాను. తానే ట్రోఫీ గెలిచేందుకు అర్హుడిని చెప్పాడు. హారికతో పోటీపడటం నేను తట్టుకోలేను కాబట్టి ఆమె అర్హురాలు అని చెప్పుకచ్చాడు. టాస్కుల్లో హద్దులు దాటినందుకు అరియానా అనర్హురాలని అఖిల్ ఫిక్స్ అయ్యాడు. సోహైల్ అరియానా, అభిజిత్ అనర్హులు అని, హారిక అరియానా అనర్హురాలు అని చెప్పింది. మెజారిటీ ఫైనలిస్టులు అరియానా విజేత అయ్యేందుకు అర్హురాలు కాదని తేల్చి చెప్పారు.
చివరగా అరియానా కాస్త తెలివిగా మాట్లాడింది. 'ఆటలో తన పేరు గుర్తుండిపోవడం బాగుంది. అందరి బుర్రల్లోకి తన పేరే వచ్చిందంటే తానే గ్రేట్ గేమర్ అంటూ ప్రకటించుకుంది. అయితే కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో హారిక విఫలమవుతుందని హారికను అనర్హురాలిగా డిసైడ్ చేసింది అరియానా. ఈ టాస్క్‌లో మొత్తానికి అరియానా, హారికకు ఎక్కువగా నెగెటివ్ ఓట్లు పడ్డాయి. ఈ టాస్క్ ముగిసిన తర్వాత హారిక, అరియానా టాస్క్ గురించి చర్చించుకున్నారు. అనర్హులుగా అమ్మాయిల పేర్లే రావడాన్ని తట్టుకోలేకపోయారు. దీంతో ట్రోఫీ ఎలాగైనా అమ్మాయే గెలవాల్సిందేనని డిసైడ్ చేసుకున్నారు.