నవాజ్ షరీఫ్‌ అవినీతికి పాల్పడ్డారు... నిర్ధారించిన కోర్టు

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అవినీతికి పాల్పడింది నిజమేనని, అందువల్ల ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, షరీఫ్ కుమార్తె మర్యమ్, అల్లుడు మ

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (09:41 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అవినీతికి పాల్పడింది నిజమేనని, అందువల్ల ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, షరీఫ్ కుమార్తె మర్యమ్, అల్లుడు మహమ్మద్ సఫ్దర్‌పైన అభియోగాలనూ పాక్ అవినీతి నిరోధక కోర్టు నిర్ధారించింది. అక్రమాస్తుల కేసులో వీళ్లను దోషులుగా తేల్చిన కోర్టు వీరిపై అవినీతి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది. 
 
బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లో నవాజ్ షరీఫ్ కూతురు, ఇద్దరు కొడుకుల పేర్ల మీద రిజిస్టర్ అయిన ఆఫ్‌షోర్‌ కంపెనీలను ఉపయోగించి లండన్‌లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు 2016లో లీక్ అయిన పనామా పేపర్స్ ద్వారా బయటపడింది. దీంతో నవాజ్ ఫ్యామిలీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని అధికారులను సుప్రీం ఆదేశించింది. దర్యాప్తు తర్వాత సుప్రీం నవాజ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిని చేసి నవాజ్ ఫ్యామిలీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యురో(ఎన్‌ఏబీ)ని ఆదేశించింది. దీంతో గత జులైలో నెలలో ఆయన ప్రధానమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments